కొండల్లో .. కోనల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డాం: అల్లరి నరేశ్ 

Itlu Maredumilli Prajaneekam movie pre release event
  • అల్లరి నరేశ్ నుంచి 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' 
  • కొంతసేపటి క్రితం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • కామెడీ .. ఎమోషన్స్ ప్రధానంగా నడుస్తుందన్న నరేశ్
  • ఈ నెల 25వ తేదీన సినిమా రిలీజ్  
అల్లరి నరేశ్ హీరోగా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమా రూపొందింది. రాజేశ్ దండ నిర్మించిన ఈ సినిమాకి ఏఆర్. మోహన్ దర్శకత్వం వహించాడు. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, కథానాయికగా ఆనంది అలరించనుంది. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించారు. 

ఈ వేదికపై అల్లరి నరేశ్ మాట్లాడుతూ .. " ఈ సినిమాలో 90 శాతం కథ అడవిలోనే జరుగుతుంది. 55 రోజుల్లో ఈ సినిమా షూటింగును పూర్తిచేశాము. అబ్బూరి రవిగారు ఈ సినిమాకి మాటలు రాశారు. మారేడుమిల్లి ఫారెస్టు ప్రాంతంలోని వారి యాసను పట్టుకుని, అందుకు తగినట్టుగా డైలాగ్స్ రాయడానికి ఆయన చాలా కష్టపడ్డారు. 

ఇక దర్శక నిర్మాతలిద్దరూ ఈ సినిమాతోనే పరిచయమవుతున్నారు. ఇద్దరికీ కూడా కంగ్రాట్స్ చెబుతున్నాను. ఈ సినిమా కోసం 250 మంది ఎంతో కష్టపడ్డారు. కొండలు ఎక్కడానికి 3 గంటలు .. దిగడానికి 3 గంటలు పట్టేది. అది అనుకున్నంత తేలికేం కాదు. ఈ సినిమా చాలా సీరియస్ గా ఉంటుందని అనుకుంటారు. కానీ ఇందులో 40 శాతం కామెడీ ఉంటుంది. మిగతా 60 శాతం ఎమోషన్ తో నడుస్తుంది" అంటూ చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Allari Naresh
Anandi
Itlu Maredumilly Prajaneekam

More Telugu News