Indian Racing League: వెలుతురు లేమితో నిలిచిపోయిన ఇండియన్ రేసింగ్ లీగ్

  • హైదరాబాదులో ఐఆర్ఎల్ పోటీలు
  • నిన్నటి నుంచి రేసింగ్ ఈవెంట్
  • ఈ సాయంత్రం కార్లు ఢీకొనడంతో ఆలస్యం
  • ట్రాక్ కు రెండ్రోజులే అనుమతి
  • నేటితో ముగిసిన ఐఆర్ఎల్
Indian Racing League early closure due to bad light

హైదరాబాదులో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) ముగిసింది. వెలుతురు తగ్గిపోవడంతో రెండో రోజు రేసింగ్ పోటీలను కాస్త ముందుగానే నిలిపివేశారు. కేవలం ఫార్ములా-4 రేస్ తోనే సరిపెట్టారు. 

ఈ సాయంత్రం క్వాలిఫైయింగ్ రేసులో రెండు కార్లు ఢీకొనడం, ఓ మహిళా రేసర్ గాయపడిన ఘటనతో రేసు ఆలస్యమైంది. దాంతో నిర్ణీత సమయంలో లోపు రేసు పూర్తి కాకపోగా, హైదరాబాదులో వెలుతురు మందగించడంతో ఐఆర్ఎల్ నిర్వాహకులు రేసును నిలిపివేశారు. 

ఇక్కడి రేసింగ్ ట్రాక్ లో పోటీలు నిర్వహించేందుకు రెండు రోజులే అనుమతి ఉండడంతో రేపు (నవంబరు 21) రేసు కొనసాగించేందుకు వీల్లేకుండా పోయింది. హైదరాబాదులో నిన్నటి నుంచి ఐఆర్ఎల్ పోటీలు జరుగుతున్న సంగతి తెలిసింద.

More Telugu News