కాలేజ్ ఫెస్ట్ లో పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు.. ఇద్దరు విద్యార్థులపై కేసు
- బెంగళూరులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ఘటన
- ఇంటర్ కాలేజ్ ఫెస్ట్ లో తమ అభిమాన ఐపీఎల్ జట్లకు మద్దతుగా నినాదాలు చేసిన విద్యార్థులు
- ఇదే సమయంలో పాకిస్థాన్ జిందాబాద్ అన్న ఇద్దరు మైనర్లు
దీన్ని మరో విద్యార్థి వీడియో రికార్డ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో కళాశాల విచారణ చేపట్టి ఇద్దరి నుంచి క్షమాపణ లేఖలు తీసుకుని వారిని సస్పెండ్ చేసింది. ఘటనపై ఫిర్యాదు రావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఐపీసీ 153 (అల్లర్లు సృష్టించే ఉద్దేశంతో రెచ్చగొట్టడం), 505(1) బి (ప్రజలకు భయాన్ని కలిగించేలా చేయడం) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు ఆ ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి తదుపరి విచారణ జరుపుతున్నారు.