Prabhas: ప్రభాస్ సినిమాకు రూ. 40 కోట్లతో భారీ సెట్లు

  • ప్రభాస్, దీపికా పదుకుణే జంటగా 'ప్రాజెక్ట్ కే'
  • హైదరాబాద్ శివార్లలో జరుగుతున్న షూటింగ్
  • రూ. 40 కోట్లతో నాలుగు సెట్ల ఏర్పాటు
Rs 40 Cr sets for Prabhas movie

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ దీపికా పదుకుణే జంటగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'ప్రాజెక్ట్ కే'. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, దిశా పటానీలు కీలక పాత్రలను పోషిస్తున్నారు. హైదరాబాద్ శివార్లలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. 

మరోవైపు ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న షెడ్యూల్ కు సంబంధించి దాదాపు రూ. 40 కోట్ల వ్యయంతో నాలుగు సెట్లను రూపొందించినట్టు సమాచారం. ఈ సెట్లలో భారీ పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ ఫైట్స్ కోసం విదేశాల నుంచి ఫైటర్స్ ను రప్పించారట. ఈ చిత్రం 2024లో రిలీజ్ కానుంది. అశ్వనీదత్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

More Telugu News