ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం... 12 మంది దుర్మరణం

Fatal road accident in Uttarakhand as 12 dies
  • జోషి మఠ్ ప్రాంతంలో ఘటన
  • లోయలో పడిపోయిన వాహనం
  • మృతుల్లో ఇద్దరు మహిళలు
  • ముగ్గురికి గాయాలు
ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చమోలీ జిల్లా జోషి మఠ్ ప్రాంతంలో ఓ వాహనం రోడ్డు పక్కన లోయలోకి పడిన దుర్ఘటనలో 12 మంది మృతి చెందారు. మరణించిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. 

ఉర్గాం-పల్లా జకోలా రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ఎస్డీఆర్ఎఫ్ బృందం కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకుంది.
Go Back to Shorts
Road Accident
Joshimath
Chamoli District
Uttarakhand

More Telugu News