Mahesh Babu: కృష్ణ మృత్యువుతో పోరాడుతున్న సమయంలోనూ ఓ చిన్నారిని ఆదుకున్న మహేశ్ బాబు

Mahesh Babu helps a child for heart surgery while Krishna being treated in hospital
  • కొన్నిరోజుల క్రితం సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూత
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • కృష్ణ చికిత్స పొందుతున్న వేళ ఓ చిన్నారి గురించి తెలుసుకున్న మహేశ్
  • వెంటనే స్పందించి ఆపరేషన్ కు ఏర్పాట్లు చేయించిన వైనం
సూపర్ స్టార్ కృష్ణ కొన్నిరోజుల కిందట మరణించిన సంగతి తెలిసిందే. తండ్రిని ఎంతగానో ప్రేమించే మహేశ్ బాబు ఆయన మరణంతో తీవ్ర వేదనకు గురయ్యారు. కృష్ణ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న సమయలో మహేశ్ బాబు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అయితే, అంత బాధలోనూ మహేశ్ బాబు మానవతా దృక్పథాన్ని వీడలేదు. 

మోక్షిత్ అనే చిన్నారి గుండె జబ్బుతో బాధపడుతున్నాడని తెలుసుకున్న మహేశ్ బాబు... ఆ చిన్నారికి అత్యవసరంగా శస్త్రచికిత్స చేయించారు. ఓవైపు తన తండ్రి మరణం అంచున నిలిచి ఉన్నప్పటికీ, చిన్నారి ప్రాణం కోసం మహేశ్ బాబు తపించారు. తండ్రి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే, మరోవైపు ఆ చిన్నారి శస్త్రచికిత్సకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు. 

కృష్ణ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని తెలిసినా, చిన్నారి మోక్షిత్ కోసం మహేశ్ బాబు స్పందించిన తీరు అభిమానులను కదిలించివేసింది. కాగా, విజయవాడ ఆంధ్ర ఆసుపత్రిలో మోక్షిత్ కు నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైనట్టు తెలుస్తోంది.
Mahesh Babu
Krishna
Moskhit
Heart Surgery
Tollywood

More Telugu News