Chinese man: సిగరెట్ తాగుతూ 42 కిలోమీటర్ల పరుగు.. చైనా వ్యక్తి రికార్డు

  • 42 కిలోమీటర్ల పొడవునా చైన్ స్మోకింగ్
  • 3 గంటల 28 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకున్న అంకుల్ చెన్
  • 1500 మంది ఆటగాళ్లలో 574వ స్థానం
Chinese man chain smokes through 42 km marathon in less than 4 hours

చైనాకు చెందిన ఓ వ్యక్తి కొత్తగా ప్రయత్నించాడు. 42 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 3 గంటల 28 నిమిషాల్లో పరిగెత్తాడు. పరిగెత్తడమే కాకుండా.. దారి పొడవునా సిగరెట్లను ఆగకుండా తాగుతూనే వెళ్లాడు. ఈ నెల 6న షాంఘైలో ఈ పోటీ నిర్వహించినట్టు ది ఇండిపెండెంట్ పత్రిక పేర్కొంది. 

నిజానికి పొగతాగడం పరుగెత్తడానికి అవరోధం అని భావిస్తుంటారు. కానీ, షాంగ్జూకు చెందిన అంకుల్ చెన్ అనే ఈ చైన్ స్మోకర్ పొగతాగడమే తన బలమని నిరూపించాడు. మొత్తం 1500 మంది ఈ పోటీలో పాల్గొనగా చెన్ 574వ స్థానంలో నిలిచాడు. ఒక 50 ఏళ్ల వ్యక్తి ఈ ఘనత సాధించడం నిజంగా రికార్డు. అయితే అంకుల్ చెన్ కు సిగరెట్ తాగుతూ పరుగు పందేల్లో పాల్గొనడం ఇదే మొదటిసారి కాదు. 2018, 2019లోనూ ఇదే మాదిరి పోటీల్లో పాల్గొన్నాడు. 

తాజా ఫీట్ పై నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. పొగతాగుతూ పరుగెత్తడం అసాధ్యమేనంటూ చెన్ ను ప్రశంసిస్తున్నారు. పొగతాగకుండా అతడు ఇంకెంత దూరం పరుగు తీయగలడో? అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. 

More Telugu News