Janhvi Kapoor: నా బాత్ రూమ్ కు గడియ ఉండదు: జాన్వీ కపూర్ హోమ్ టూర్ వీడియో

Janhvi Kapoor says mom Sridevi wouldnot let her lock her bathroom door because chennai home tour vedio
  • చెన్నైలో శ్రీదేవి ఇంటిని పరిచయం చేసిన జాన్వీ
  • బాత్ రూమ్ కు గడియ లేకపోవడంపై వివరణ
  • అబ్బాయిలతో మాట్లాడతానన్న భయంతో అమ్మ పెట్టనీయలేదని వెల్లడి
నటి శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్ ముద్దుల తనయ జాన్వీ కపూర్... చెన్నైలో తన తల్లి శ్రీదేవి నివాసాన్ని అభిమానులకు పరిచయం చేసింది. ఇందుకు సంబంధించి హోమ్ టూర్ వీడియో విడుదల చేసింది. అందులో ఆమె తండ్రి బోనీ కపూర్, ఇతర కుటుంబ సభ్యులు కూడా కనిపిస్తారు. 

శ్రీదేవి నటిగా తన కెరీర్ లో బిజీగా ఉన్న సమయంలో చెన్నైలోనే ఎక్కువ రోజుల పాటు ఉండిపోయేవారు. ఆ సమయంలో ఆమె కొనుగోలు చేసిన ఇల్లు ఇది. 2018లో శ్రీదేవి మరణం తర్వాత ఇంటిని నవీకరించారు. ఈ ఇంటిపై తన మనసులోని భావాలను జాన్వీ అభిమానులతో పంచుకుంది.

‘‘ఈ ఇంటికి సంబంధించి చెప్పాలంటే... ఈ ఇంటితో నాకు మిగిలిన జ్ఞాపకాలతోపాటు, ఇది ఎంతో పాతది. మా వరకు కొంచెం కొత్తది. ఈ ఇంట్లోని నా గది బాత్ రూమ్ కు గడియ ఉండదు. లాక్ పెట్టేందుకు అమ్మ అంగీకరించకపోవడం నాకు గుర్తుంది. బాత్ రామ్ లోకి వెళ్లి అబ్బాయిలతో ఫోన్లో మాట్లాడతానేమోనన్న భయం అమ్మలో ఉండేది. అందుకే నా బాత్ రూమ్ డోర్ కు లోపలి వైపు గడియ పెట్టేందుకు అనుమతించలేదు. ఇప్పుడు ఈ గదులన్నీ కొత్తదనం సంతరించుకున్నా గానీ, నా బాత్ రూమ్ కు మాత్రం లాక్ ఉండదు’’అని జాన్వీ వివరించింది. 

ఈ వీడియోలో భాగంగా చెన్నై ఇంటిలో తనకు ఇష్టమైన ప్రదేశాలను జాన్వీ చూపించింది. ఈ ఇల్లు పాత కాలం నాటి సినిమాల్లో సంపన్నుల ఇల్లు మాదిరి, అద్భుతమైన ఆర్కిటెక్చర్, ఇంటీరియర్స్ తో ఉండడం విశేషం. మరిన్ని విశేషాలకు వీడియో చూసేయండి. 
Janhvi Kapoor
home tour vedio
chennai
bathroom
no lock

More Telugu News