విజయమే మన లక్ష్యం.. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధంకండి: కమల్ హాసన్
- ఎంఎన్ఎం పార్టీ జిల్లా నేతలతో కమల్ సమావేశం
- బూత్ ల వారీగా పార్టీని బలోపేతం చేయాలని సూచన
- పొత్తుల విషయాన్ని అధిష్ఠానం చూసుకుంటుందని వ్యాఖ్య
ఈ సందర్భంగా మీడియాతో కమల్ మాట్లాడుతూ, పార్లమెంటు ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని తమ నేతలకు సూచించామని చెప్పారు. గత ఎన్నికల్లో జరిగిన తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగుతామని తెలిపారు. మరోవైపు ఈసారి డీఎంకేతో కలిసి కమల్ ముందుకు సాగే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. ప్రస్తుతం డీఎంకే కూటమిలో ఉన్న ఐజేకే పార్టీ బీజేపీతో పొత్తుకు రెడీ అవుతుండటంతో.. ఆ స్థానంలో కమల్ పార్టీని స్టాలిన్ దగ్గరకు తీసుకునే అవకాశం ఉందని చెపుతున్నారు.