Rotomac: రూ. 750 కోట్ల మేర మోసం చేసిన పెన్నుల కంపెనీ... సీబీఐ కేసు నమోదు

  • 7 బ్యాంకుల కన్సార్టియం నుంచి రూ. 2,919 కోట్ల అప్పు కలిగి ఉన్న రొటోమాక్ కంపెనీ
  • ఇందులో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వాటా 23 శాతం
  • 2016 జూన్ 30న డీఫాల్ట్ అయిన రొటోమాక్
CBI filed case against pen company Rotomac

ప్రముఖ పెన్నుల తయారీ సంస్థ రొటోమాక్ చిక్కుల్లో పడింది. ఆ సంస్థపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకును రూ. 750 కోట్ల మేర మోసం చేసిందని రొటోమాక్ పై అభియోగాలను నమోదు చేసింది. కంపెనీ డైరెక్టర్లు సాధన కొఠారి, రాహుల్ కొఠారిలై సెక్షన్ 120 బీ (నేరపూరిత కుట్ర), సెక్షన్ 420 (చీటింగ్) కింద అభియోగాలు మోపింది. 

బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని ఏడు బ్యాంకుల కన్సార్టియం నుంచి ఈ కంపెనీ మొత్తం రూ. 2,919 కోట్ల అప్పు కలిగి ఉంది. ఇందులో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వాటా 23 శాతం. 

2016 జూన్ 30న పేమెంట్లలో ఈ కంపెనీ డిఫాల్ట్ అయింది. ఆ తర్వాత రూ. 750.54 కోట్ల బకాయితో నిరర్థక ఆస్తిగా ప్రకటించబడింది. కన్సార్టియం సభ్యుల నుంచి వచ్చిన ఫిర్యాదుతో ఇప్పటికే ఈ కంపెనీపై సీబీఐ, ఈడీలు విచారణ జరిపాయి. తాజాగా సీబీఐ కేసు నమోదు చేసింది.

More Telugu News