OnePlus Pad: వన్ ప్లస్ నుంచి పవర్ ఫుల్ ప్యాడ్

OnePlus Pad India launch likely next year price expected to be under Rs 20000
  • వచ్చే ఏడాది విడుదల చేసే అవకాశం
  • 12.4 అంగుళాలతో ఓఎల్ఈడీ డిస్ ప్లే
  • 10,090 ఎంఏహెచ్ బ్యాటరీ
  • రూ.20వేల లోపే ధర నిర్ణయించొచ్చని అంచనా
వన్ ప్లస్ నుంచి వచ్చే ఏడాది ఒక పవర్ ఫుల్ ప్యాడ్ (ట్యాబ్లెట్) విడుదల కానుందని మార్కెట్ వర్గాల సమాచారం. దీన్ని రూ.20 వేలలోపు బడ్జెట్ లోనే తీసుకురావచ్చని తెలుస్తోంది. అదే నిజమైతే వన్ ప్లస్ ప్యాడ్ కు మంచి ఆదరణ లభించే అవకాశం ఉంది. వన్ ప్లస్ ప్రీమియం ఫోన్లకు మన దేశంలో మంచి మార్కెట్ ఉండడం తెలిసిందే. హైఎండ్ ఫీచర్లను మధ్యస్థాయి ధరలకే అందించడం వన్ ప్లస్ ప్రత్యేకత. విక్రయానంతరం మెరుగైన సర్వీసులు కూడా వన్ ప్లస్ బలాల్లో ఒకటి.

వన్ ప్లస్ 11 సిరీస్ ఫోన్లపై ప్రస్తుతం పని చేస్తోంది. వీటిని వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల చేసే అవకాశాలున్నాయి. అప్పుడే వన్ ప్లస్ ప్యాడ్ ను కూడా తీసుకురావచ్చు. ఈ ప్యాడ్ 12.4 అంగుళాల ఫుల్ హెడ్ డీ ప్లస్ ఓఎల్ఈడీ డిస్ ప్లే, స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్, 1,0090 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుందని అంచనా. వెనుక 13 మెగాపిక్సల్, 5 మెగాపిక్సల్ తో రెండు కెమెరాలు, ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరా ఉంటాయని తెలుస్తోంది.
OnePlus Pad
launch
India
2023
budget price

More Telugu News