కృష్ణకి తగిన హీరోయిన్స్ అనిపించుకున్నది వీరే!
- దశాబ్దాల పాటు హీరోగా మెప్పించిన కృష్ణ
- ఆయన సరసన అలరించిన శ్రీదేవి
- అందంతో మరింతగా ఆకట్టుకున్న జయప్రద
- నటనతో కట్టిపడేసిన జయసుధ
- కృష్ణ కెరియర్లో ఈ ముగ్గురి ప్రభావమే ఎక్కువ
కృష్ణ తన కెరియర్ ఆరంభంలో వాణిశ్రీ .. కాంచన వంటి హీరోయిన్స్ తో కొన్ని సినిమాలు చేశారు. అందరికంటే ఎక్కువగా ఆయన సరసన విజయ నిర్మల కనిపించారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో 'మీనా' .. 'అల్లూరి సీతారామరాజు' వంటి సూపర్ హిట్లు ఉన్నాయి. ఆ తరువాత తరం కథానాయికలుగా జయసుధ .. జయప్రద .. శ్రీదేవి రంగంలోకి దిగారు. ఇక అప్పటి నుంచి కృష్ణ సరసన నాయికలుగా వారే ఎక్కువ సందడి చేశారు.
ఈ ముగ్గురు హీరోయిన్స్ తో కృష్ణ పదుల సంఖ్యలో సినిమాలు చేశారు. శ్రీదేవి కాంబినేషన్లో 'వజ్రాయుధం' .. 'పచ్చని కాపురం', జయప్రద కాంబినేషన్లో 'మండే గుండెలు' .. 'సింహాసనం', జయసుధ కాంబినేషన్లో 'శక్తి' .. 'పల్నాటి సింహం' వంటి సినిమాలు భారీ విజయాలను సాధించినవిగా కనిపిస్తాయి. ఈ ముగ్గురు హీరోయిన్స్ లో కృష్ణ ఎవరితో కలిసి కనిపించినా హిట్ పెయిర్ అనేట్టుగా కనిపించేది. ఆ తరువాత వచ్చిన విజయశాంతి .. రాధ .. రాధిక .. సుహాసినితో కృష్ణ నటించినా, ఆయన జోడీగా ఎక్కువ మార్కులు దక్కించుకున్నది మాత్రం శ్రీదేవి .. జయసుధ .. జయప్రదనే అనడంలో ఎలాంటి సందేహం లేదు.
.