Kane Williamson: జట్టు నుంచి కేన్ విలియమ్సన్ ను విడుదల చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్

SRH releases Kane Williamson
  • ఐపీఎల్ లో ఆటగాళ్ల విడుదలకు ముగిసిన గడువు
  • సంచలన నిర్ణయం తీసుకున్న సన్ రైజర్స్
  • పూరన్, షెపర్డ్ లను కూడా సాగనంపిన వైనం
గత ఐపీఎల్ సీజన్ లో నిరాశాజనక ప్రదర్శన కనబర్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రక్షాళన షురూ చేసింది. ఆటగాళ్ల విడుదలకు నేటితో గడువు ముగియగా, ఏకంగా కెప్టెన్ కేన్ విలియమ్సన్ ను జట్టు నుంచి విడుదల చేసి సంచలనం సృష్టించింది. విలియమ్సన్ తో పాటు విండీస్ ఆటగాళ్లు నికోలాస్ పూరన్, రొమారియో షెపర్డ్ లను కూడా సాగనంపింది. 

విలియమ్సన్ ను విడుదల చేయడం వల్ల సన్ రైజర్స్ కు రూ.14 కోట్లు మిగిలినట్టయింది. గత ఐపీఎల్ సీజన్ లో విలియమ్సన్ ఆటగాడిగానూ, కెప్టెన్ గానూ విఫలమయ్యాడు. విలియమ్సన్ వైఫల్యం సన్ రైజర్స్ పై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలోనే అతడిని విడుదల చేసినట్టు తెలుస్తోంది. 

కాగా, విలియమ్సన్ ను రిలీజ్ చేసినట్టు ప్రకటించిన సన్ రైజర్స్... కేన్ మామా ఎప్పటికీ మనవాడే అంటూ ట్వీట్ చేసింది. థాంక్యూ కేన్ అంటూ కృతజ్ఞతలు తెలిపింది. ఈ ట్వీట్ పై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. వచ్చే ఐపీఎల్ వేలంలో కేన్ విలియమ్స్ ను మళ్లీ సన్ రైజర్స్ యాజమాన్యం కొనుగోలు చేస్తుందా... అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

సన్ రైజర్స్ విడుదల చేసిన ఆటగాళ్లు...
కేన్ విలియమ్సన్, నికోలాస్ పూరన్, జగదీశ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రొమారియో షెపర్డ్, సౌరభ్ దూబే, షాన్ అబ్బాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్.

సన్ రైజర్స్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు...
అయిడెన్ మార్ క్రమ్, రాహుల్ త్రిపాఠి, అబ్దుల్ సమద్, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, ఫజల్ హక్ ఫరూఖీ, కార్తీక్ త్యాగి, భువనేశ్వర్ కుమార్, టి.నటరాజన్, ఉమ్రాన్ మాలిక్.
Kane Williamson
SRH
IPL

More Telugu News