TDP: కర్నూలు జిల్లా పర్యటనకు చంద్రబాబు... రేపటి నుంచి 3 రోజులు అక్కడే బస

tdp chief chandrababu tour in kurnool district starts from tomorrow
  • పత్తికొండలో బహిరంగ సభతో ప్రారంభం కానున్న చంద్రబాబు పర్యటన
  • బుధవారం రాత్రి ఆదోనిలో బస చేయనున్న టీడీపీ అధినేత
  • గురువారం ఆదోని, ఎమ్మిగనూరుల్లో రోడ్ షో నిర్వహించనున్న వైనం
  • గురువారం రాత్రి కర్నూలులో బస... శుక్రవారం ఉదయం జిల్లా నేతలతో సమీక్ష
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రేపు (బుధవారం) కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. రేపటి నుంచి ఆయన జిల్లాలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన 2 రాత్రులు జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో బస చేయనున్నారు. ఈ మేరకు చంద్రబాబు పర్యటనకు సంబంధించి టీడీపీ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. 

రేపు మధ్యాహ్నానికి జిల్లాలోని పత్తికొండ చేరనున్న చంద్రబాబు అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో మాట్లాడతారు. అనంతరం రాత్రికి ఆదోనికి చేరుకునే ఆయన పట్టణంలోనే బస చేస్తారు. గురువారం ఉదయం ఆదోనిలో రోడ్ షో నిర్వహించనున్న చంద్రబాబు... ఆ తర్వాత జిల్లాలోని ఎమ్మిగనూరులో రోడ్డు షో నిర్వహిస్తారు. సాయంత్రం పట్టణంలో నిర్వహించనున్న బహిరంగ సభలో మాట్లాడతారు. గురువారం రాత్రికి కర్నూలులో బస చేయనున్న చంద్రబాబు... శుక్రవారం నగరంలో పార్టీకి చెందిన జిల్లా నేతలతో సమావేశం నిర్వహిస్తారు.
TDP
Chandrababu
Kurnool District
Adoni
Pattikonda
Yemmiganur
Kurnool

More Telugu News