నా కుమార్తెనే పార్టీ మారమని అడిగారు: కేసీఆర్
- 3 గంటల పాటు కొనసాగిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం
- ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని ప్రస్తావించిన కేసీఆర్
- ఇంత కంటే ఘోరం మరొకటి ఉంటుందా? అని ఆగ్రహం
- విపక్షాల ఎదురు దాడులను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపు
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఎంపీలు, పార్టీ కీలక నేతలతో కలిసి మంగళవారం కేసీఆర్ ఓ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ నేతల తీరుపై ఘాటు విమర్శలు గుప్పించారు. ఐటీ, ఈడీ, సీబీఐ దాడుల పేరిట కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విరుచుకుపడుతోందని ఆయన విమర్శించారు. బీజేపీ చేయించే ఈ దాడులను తిప్పికొట్టాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీజేపీతో ఇక పోరాటమేనని కూడా ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీతో పాటు ఇతర ప్రతిపక్షాల నుంచి రాజకీయంగా ఎదురు దాడి ఉంటుందన్న కేసీఆర్... ఆ దాడులను తిప్పికొట్టే దిశగా నేతలు సిద్ధం కావాలని సూచించారు.