Swara Bhasker: ఆ రాక్షసుడికి కఠిన శిక్ష విధించాలి: నటి స్వరా భాస్కర్

Swara Bhasker condemns horrifying gruesome murder of woman in Delhi hopes monster gets harshest punishment
  • సహజీవన భాగస్వామిని అతి కిరాతకంగా హత్య చేసిన ప్రేమికుడు 
  • మృతదేహాన్ని 35 భాగాలుగా చేసి వాటిని ఢిల్లీ పరిసరాల్లో పడేసిన వైనం 
  • ఎంతో భయంకరమైన, విషాదకరమైన ఘటనగా పేర్కొన్న స్వరా భాస్కర్ 
  • నమ్మిన వ్యక్తే ఆమె పట్ల ఇంత ద్రోహానికి పాల్పడడంపై విచారం 
ఢిల్లీలో సహజీవన భాగస్వామిని అతి కిరాతకంగా హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ డిమాండ్ చేశారు. ఈ కేసులో పోలీసులు ఆఫ్తాబ్ అమీన్ పూనవాలా (28)ను అరెస్ట్ చేయడం తెలిసిందే. కొంతకాలం సహజీవనం తర్వాత పెళ్లి చేసుకుందామని శ్రద్ధా వాల్కర్ ఒత్తిడి చేయడంతో, అమీన్ పూనవాలా ఆమెను హత్య చేయడం తెలిసిందే. మృతదేహాన్ని 35 భాగాలుగా చేసి వాటిని ఢిల్లీ సరిహద్దు అటవీ ప్రాంతంలో పడేసినట్టు పోలీసులు విచారణలో తేలింది. 

ఈ దారుణాన్ని బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ ఖండించారు. ఆ రాక్షసుడికి అత్యంత కఠిన శిక్ష పడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఓ జర్నలిస్ట్ కోట్ ను రీట్వీట్ చేస్తూ.. ‘‘ఎంతో భయంకరమైన, విషాదకరమైనది ఈ కేసు. ఈ పేద అమ్మాయి ప్రేమించి, నమ్మిన వ్యక్తే ఇంత ఘోర ద్రోహానికి పాల్పడడం పట్ల నా హృదయం ద్రవిస్తోంది. పోలీసులు త్వరగా విచారణను ముగిస్తారని, ఈ రాక్షసుడికి కఠిన శిక్ష పడుతుందని ఆశిస్తున్నాను’’ అంటూ స్వరా భాస్కర్ ట్వీట్ చేసింది.
Swara Bhasker
Bollywood actor
condemns
horrifying murder
harshest punishment

More Telugu News