రాజకీయాల్లో సూపర్ స్టార్ కృష్ణ ముద్ర!
- కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన కృష్ణ
- రాజీవ్ గాంధీ పిలుపుతో రాజకీయాల్లోకి ఎంట్రీ
- రాజీవ్ మరణంతో పాలిటిక్స్ కు దూరమైన కృష్ణ
1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు ఎంపీగా కృష్ణ బరిలో నిలబడ్డారు. టీడీపీ అభ్యర్థి బోళ్ల బుల్లి రామయ్యపై 71 వేల భారీ మెజారిటీ సాధించి, పార్లమెంట్ లో కృష్ణ అడుగుపెట్టారు. అయితే, రాజీవ్ గాంధీ హత్య తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, మధ్యంతర ఎన్నికలలో ఓటమి తర్వాత ఆయన పాలిటిక్స్ కు దూరం జరిగారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తూనే వచ్చారు. 2004 ఎన్నికలలో వైఎస్ రాజశేఖర రెడ్డికి మద్దతు తెలిపారు. వైఎస్ మరణం తర్వాత జగన్ కు సపోర్ట్ గా ఉన్న కృష్ణ.. తర్వాతి కాలంలో రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు.