Telangana: తెలుగు రాష్ట్రాల పర్యటనకు మోదీ ఎందుకు వచ్చారో చెప్పిన రేణుకా చౌదరి

congress leader renuka chowdary satires on pmmodi tour in teleugu states
  • గత వారం రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన మోదీ
  • మోదీ పర్యటనను అత్యవసర దక్షిణ భారత పర్యటనగా అభివర్ణించిన రేణుకా చౌదరి
  • రాహుల్ యాత్రను చూసి భయపడ్డ మోదీ అత్యవసర టూర్ కు వచ్చారని ఎద్దేవా
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం విశాఖ వచ్చిన మోదీ... ఆ రాత్రి విశాఖలోనే బస చేశారు. శనివారం మధ్యాహ్నం దాకా విశాఖలోనే ఉన్న మోదీ... ఆ తర్వాత తెలంగాణకు వచ్చారు. రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసిన మోదీ... తెలంగాణ నుంచి ఢిల్లీ తిరిగి వెళ్లారు. రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మోదీ పర్యటనపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి సోమవారం సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మోదీ పర్యటనను రేణుకా చౌదరి అత్యవసర పర్యటనగా అభివర్ణించారు. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో మోదీ టూర్ ను ఆమె దక్షిణాది పర్యటనగా కూడా చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దక్షిణ భారత దేశంలో ముగిసిందని, ఈ యాత్రకు లభించిన అనూహ్య స్పందనను చూసి బీజేపీ భయపడిందని ఆమె పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రకు దక్కిన ఆదరణను చూసి మోదీ భయపడ్డారని, అందుకే దక్షిణ భారతంలో రాహుల్ యాత్ర ముగియగానే... మోదీ దక్షిణ భారత పర్యటనకు ఆగమేఘాలపై వచ్చారని రేణుకా చౌదరి అన్నారు.
Telangana
Andhra Pradesh
Prime Minister
Narendra Modi
Congress
Rahul Gandhi
Bharat Jodo Yatra
South India

More Telugu News