Tollywood: 8 మంది వైద్య నిపుణులతో కృష్ణకు చికిత్స..., వెంటిలేటర్ పైనే సూపర్ స్టార్

contimental hospital says supres star krishna health condition is still critical
  • గుండెపోటుతోనే కృష్ణ ఆసుపత్రికి వచ్చారన్న కాంటినెంటల్ హాస్పిటల్
  • కార్డియక్ అరెస్టుతో మూత్ర పిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు, మెదడు పనితీరు దెబ్బ తిన్నదని వెల్లడి
  • 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమని వైద్యుల ప్రకటన
ఉన్నట్టుండి అనారోగ్యానికి గురైన టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం సోమవారం సాయంత్రానికి కూడా తీవ్ర విషమంగానే ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం కృష్ణకు చికిత్స అందిస్తున్న కాంటినెంటల్ ఆసుపత్రి ఓ బులెటిన్ ను విడుదల చేసింది. సోమవారం తెల్లవారుజామున ఆసుపత్రికి వచ్చిన సమయంలో కృష్ణకు గుండె పోటు వచ్చిందని వైద్యులు ప్రకటించిన సంగతి తెలిసిందే. సీపీఆర్ చేయడంతో గుండె పోటు ముప్పు నుంచి కృష్ణ తప్పించుకున్నా... ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని తెలిపారు.

ప్రస్తుతం కృష్ణకు 8 మంది వైద్య నిపుణులతో చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కార్డియాక్ అరెస్టుతో కృష్ణ శరీరంలోని పలు అవయవాల పనితీరుపై తీవ్ర ప్రభావం పడిందని ఆసుపత్రి తెలిపింది. కార్డియక్ అరెస్టు కారణంగా కృష్ణ శరీరంలోని మూత్ర పిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు, మెదడు పనితీరు దెబ్బతిన్నదని వెల్లడించింది. ఇంకో 24 గంటలు గడిస్తే గానీ కృష్ణ ఆరోగ్య పరిస్థితి ఏమిటన్నది చెప్పలేమని కూడా వెల్లడించింది. ప్రస్తుతం వెంటిలేటర్ పైనే కృష్ణకు చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
Tollywood
Krishna
Super Star
Continental Hospital
Cardiac Arrest

More Telugu News