Baladithya: నా వలన గీతూ వెళ్లిపోయిందంటే ఒప్పుకోను: బాలాదిత్య

Bigg Boss 6  Update
  • నిన్ననే ఎలిమినేట్ అయిన బాలాదిత్య
  • శ్రీహాన్ వెంటనే నిర్ణయాలు తీసుకోలేడని వ్యాఖ్య 
  • ఇనాయాకి నోటి దురుసు ఎక్కువని వ్యాఖ్య 
  • శ్రీసత్యకి తొందరపాటు ఎక్కువని వివరణ  
బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వారం వాసంతి - బాలాదిత్య బయటికి వచ్చారు. తాజాగా 'బీబీ కేఫ్' కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలాదిత్య మాట్లాడుతూ, బిగ్ బాస్ హౌస్ కి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించాడు. "గీతూ నా సిగరెట్లు దాచడం.. గేమ్ కి సిగరెట్లకు ముడిపెట్టడం వలన ఆ రోజున నాకు కోపం వచ్చింది. ఆటపై కంటే కూడా సిగరెట్లపై ఆసక్తిని చూపిస్తున్నాడని కామెంట్స్ వస్తాయనే, ఇకపై హౌస్ లో సిగరెట్స్ తాగనని మాట ఇచ్చాను" అన్నాడు.

"నేను నామినేట్ చేసే విషయానికే వస్తే, గీతూ బయటికి వెళ్లిపోవాలనే ఉద్దేశంతో నామినేట్ చేయలేదు. ఆమె చేసిన తప్పేమిటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో చేశాను. నా వలన గీతూ బయటికి వెళ్లిపోయిందంటే నేను ఒప్పుకోను. ఒకరివలన ఒకరు వెళ్లిపోతారంటే నేను అంగీకరించను. వాళ్ల వల్ల వారే బయటికి వస్తారంతే. ఎవరు చేసిన పనులకు వారే బాధ్యులు. ఇక ఫైమా విషయంలో నేను సీరియస్ కావడంలో అర్థం ఉందనే అనుకుంటున్నాను. ఎందుకంటే నాతో తనకి అంత చనువు లేదు .. కానీ ఆమె ఎద్దేవా చేస్తూ మాట్లాడింది" అన్నాడు. 

ఇక శ్రీహాన్ గురించి మాట్లాడుతూ .. "తాను చాలా బాగా గేమ్ ఆడతాడు. అయితే అప్పటికప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకోవలసి వస్తే మాత్రం తీసుకోలేడు. ఆ విషయంలో మాత్రం అతను వీక్ అనే చెబుతాను. ఇక శ్రీసత్య విషయానికొస్తే, తను గేమ్ ఆడేటప్పుడు నోరు ఎక్కువగా జారుతూ ఉంటుంది. ఇనయాకి కాస్త నోటి దురుసు ఎక్కువే. ఒక పాయింటు నుంచి మరో పాయింటుకు వెళ్లిపోతూ ఉంటుంది. అయితే వచ్చినప్పటికంటే ఇప్పుడు చాలా బెటరు" అంటూ చెప్పుకొచ్చాడు బాలాదిత్య.
Baladithya
Geethu
Sri sathya
Faima
Bigg Boss

More Telugu News