Donald Trump: బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన ట్రంప్ కుమార్తె.. దగ్గరుండి పెళ్లి జరిపించిన అమెరికా మాజీ అధ్యక్షుడు

Donald Trump Daughter Tiffany Trump Weds Michael Boulos
  • మైఖేల్ బౌలస్‌ను పెళ్లాడిన టిఫానీ ట్రంప్
  • ఫ్లోరిడాలోని తమ ఫ్యామిలీ క్లబ్‌లో వివాహం
  • వరుడి చేతికి కుమార్తె చేతిని అందించిన ట్రంప్
  • అంగరంగ వైభవంగా వివాహం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-నటి మార్లా మాపెల్స్ ఏకైక కుమార్తె టిఫానీ ట్రంప్ (29) వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. బాయ్ ఫ్రెండ్ మైఖేల్ బౌలస్‌ (25)ను శనివారం సాయంత్రం సౌత్ ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో ఉన్న తమ ఫ్యామిలీ క్లబ్‌లో వివాహం చేసుకున్నారు. అంగరంగ వైభవంగా జరిగిన వివాహానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

లాంగ్ స్లీవ్ వెడ్డింగ్ గౌనులో టిఫానీ మెరిసిపోయారు. ఆమె తల్లి మార్లా లావెండర్ ఈవెనింగ్ గౌన్ ధరించారు. ఈ రెండింటినీ ప్రముఖ డిజైనర్ ఇలీ సాబ్ రూపొందించారు. ఈ వివాహానికి ట్రంప్ సహా ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జేర్‌డ్ కుష్నర్, మెలానియా ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్, బరోన్ ట్రంప్ తదితరులు హాజరయ్యారు. ట్రంప్ దగ్గరుండి ఈ పెళ్లి జరిపించారు. టిఫానీని వివాహ వేదిక వద్దకు తీసుకొచ్చిన ట్రంప్ ఆ తర్వాత ఆమెకు ముద్దుపెట్టి వరుడు మైఖేల్‌కు వధువు చేతిని అందించారు.
Donald Trump
Tiffany Trump
Michael Boulos
America

More Telugu News