Andhra Pradesh: 18 నెలల్లో మంత్రి రోజాను ఇదే స్టేషన్ లో కూర్చోబెడతా: జనసేన నేత కిరణ్ రాయల్

janasena leader kiran royal viral comments on ap minister rk roja
  • అరెస్టైన వెంటనే బెయిల్ పై విడుదలైన కిరణ్ రాయల్
  • అరెస్ట్ సందర్భంగా కానిస్టేబుల్ మొబైల్ ద్వారా రోజా తనతో మాట్లాడారని ఆరోపణ
  • పోలీసులు తన పట్ల దారుణంగా వ్యవహరించారని మండిపాటు
ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాపై తిరుపతికి చెందిన జనసేన నేత కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఏ స్టేషన్ లో అయితే కూర్చోబెట్టారో... అదే స్టేషన్ లో మంత్రి రోజాను 18 నెలలు తిరిగే లోగానే కూర్చోబెడతానని ఆయన అన్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి అరెస్టైన కిరణ్... శనివారం మధ్యాహ్నానికే బెయిల్ పై విడుదలయ్యారు. అనంతరం జనసేన తిరుపతి జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ తో కలిసి మీడియాతో మాట్లాడిన సందర్భంగా కిరణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

తన అరెస్ట్ కు మంత్రి రోజాతో పాటు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డిలే కారణమని కిరణ్ రాయల్ ఆరోపించారు. శుక్రవారం తనను తన ఇంటిలో అరెస్ట్ చేస్తున్న సందర్భంగా పోలీసులు అత్యంత దారుణంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. ఓ ఉగ్రవాది కంటే కూడా దారుణంగా తనను పోలీసులు ట్రీట్ చేశారన్నారు. అరెస్ట్ సందర్భంగా ఓ కానిస్టేబుల్ మొబైల్ ఫోన్ ద్వారా మంత్రి తనతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. తనను దూషించినందుకే నిన్ను అరెస్ట్ చేస్తున్నారని రోజా చెప్పారన్నారు. అయితే పవన్ కల్యాణ్ ను మీరు వ్యక్తిగతంగా దూషించారు కదా అని తాను బదులిచ్చినట్లు తెలిపారు.
Andhra Pradesh
Janasena
Tirupati
Kiran Royal
YSRCP
Roja

More Telugu News