Revanth Reddy: టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై చర్యలేవి?: మోదీకి రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

Revanth Reddy Writes Open Letter To PM Modi
  • విభజన హామీల పరిష్కారం మాటేమిటంటూ మోదీని ప్రశ్నించిన రేవంత్‌రెడ్డి
  • చేనేతపై విధించిన జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్
  • బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై యువత పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయని ఆవేదన
టీఆర్ఎస్ ప్రభుత్వంపై చర్యలు ఏవని ప్రశ్నిస్తూ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి బహిరంగ లేఖ రాశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో రేవంత్ లేఖకు ప్రాధాన్యం సంతరించుకుంది. రేవంత్ ఈ లేఖలో పలు విషయాలను ప్రస్తావించారు. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలతోపాటు తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. విభజన హామీలను నెరవేర్చే దిశగా ప్రధాని ప్రయత్నించకపోవడం దురదృష్టకరమని అన్నారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేమని చెప్పి తెలంగాణ యువతకు నిరాశను మిగిల్చారని అన్నారు. 

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ సహా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. గత ప్రభుత్వం ప్రకటించిన ఐటీఐఆర్‌ ప్రాజెక్టును బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిన విషయాన్ని రేవంత్ తన లేఖలో గుర్తు చేశారు. అలాగే, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలన్న డిమాండ్‌ను కేంద్రం పట్టించుకోకపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేతపై విధించిన జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపణలతోనే సరిపెడుతున్నారని, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవని రేవంత్ ఆ లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Revanth Reddy
Congress
Telangana
Narendra Modi

More Telugu News