Andhra Pradesh: ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ సెల్ఫీ

ap minister gudivada amarnath takes a selfie with pm modi
  • విశాఖ పర్యటనకు వచ్చిన మోదీ
  • మోదీతో సెల్ఫీ తీసుకున్న మంత్రి అమర్ నాథ్
  • అమర్ నాథ్ సెల్ఫీలో చేతులెత్తి మొక్కుతున్న మోదీ
మనకు ఇష్టమైన వ్యక్తులు కనిపిస్తే... వారితో ఓ సెల్ఫీ తీసుకోవాలని ఉబలాటపడతాం. ఏపీ మంత్రులు కూడా అందుకు మినహాయింపేమీ కాదు. విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీతో సెల్ఫీలు తీసుకునేందుకు ఏపీ మంత్రులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే గతంలో పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా వేదికపైనే మోదీతో సెల్ఫీ తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా విశాఖ పర్యటనకు వచ్చిన మోదీతో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ సెల్ఫీ తీసుకున్నారు. మోదీతో తాను తీసుకున్న సెల్ఫీని అమర్ నాథ్ తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.

మోదీతో అమర్ నాథ్ తీసుకున్న సెల్ఫీకి ఓ ప్రత్యేకత ఉందన్న వాదన వినిపిస్తోంది. సాధారణంగా ఎవరైనా తమ వద్దకు సెల్ఫీ కోసమో, ఫొటో కోసమో వస్తే... ఆయా రంగాల ప్రముఖులు చిరు నవ్వులు చిందిస్తూ పోజిస్తారు. గతంలో రోజాతో సెల్ఫీ సందర్భంగా మోదీ ఇదే మాదిరిగా చిరునవ్వులు చిందిస్తూ పోజిచ్చారు. అయితే అమర్ నాథ్ సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో మోదీ... రెండు చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉండిపోయారు. ఈ సెల్ఫీని చూసిన నెటిజన్లు అమర్ నాథ్ ను ట్రోల్ చేస్తూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.
Andhra Pradesh
Prime Minister
Narendra Modi
YSRCP
Gudivada Amarnath
Selfie
Vizag

More Telugu News