Sonali Bendre: సొనాలీ బింద్రే 20వ వివాహ వార్షికోత్సం.. సంబరాలకు ప్రముఖులు

Aishwarya Rai Abhishek Bachchan twin in blue at Sonali Bendre wedding anniversary party at home
  • సినీ ప్రముఖులు, స్నేహితులకు ఆహ్వానం
  • సొనాలీ నివాసానికి ఐశ్వర్య, అభిషేక్ రాక
  • పెళ్లినాటి ఫొటోను షేర్ చేసిన సొనాలీ బింద్రే
మురారి, మన్మధుడు సినిమాలు గుర్తున్నాయా? ఈ చిత్రాల్లో నటించిన సోనాలీ బింద్రే 20వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా సినీ రంగ ప్రముఖులు, స్నేహితులు, సన్నిహితులకు సొనాలీ బింద్రే, గోల్డీ బెహెల్ దంపతులు శనివారం ముంబైలోని తమ నివాసంలో విందు ఏర్పాటు చేశారు. 

వీరి ఆహ్వానం మేరకు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ దంపతులు సొనాలీ నివాసానికి విచ్చేశారు. వీరిద్దరూ బ్లూ రంగు డ్రెస్ లో కనిపించారు. ఐశ్వర్య అయితే బ్లూ రంగు అనార్కలీ డ్రెస్ లో అతిథుల కళ్లను ఆకర్షిస్తోంది. అభిషేక్ వైట్ టీ షర్ట్, పైన బ్లూ కలర్ జాకెట్ తో వచ్చాడు. నటులు కునాల్ కపూర్, ఆయన భార్య నైనా బచ్చన్ కూడా విచ్చేశారు.  

20వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా సొనాలీ బింద్రే ఇన్ స్టా గ్రామ్ లో తన పెళ్లి ఆల్బమ్ నుంచి ఒక ఫొటోను, ఒక చిన్న వీడియో క్లిప్ ను పోస్ట్ చేసింది. ‘అప్పుడు, ఇప్పుడు, ఎప్పటికీ.. 20 ఏళ్లు’ అని క్యాప్షన్ పెట్టింది.
Sonali Bendre
wedding anniversary
dinner party
Aishwarya Rai
Abhishek Bachchan

More Telugu News