Bollywood: పోలీస్ స్టేషన్ కు చేరిన బాలీవుడ్ హీరోయిన్ల రగడ

Sherlyn Chopra and Rakhi Sawant file complaints against each other
  • కొనాళ్లుగా రాఖీ సావంత్, షెర్లిన్ చోప్రా మధ్య మాటల యుద్ధం
  • బిగ్ బాస్ కంటెస్టెంట్ సాజిద్ ఖాన్ విషయంలో గొడవ
  • ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసిన వైనం
బాలీవుడ్ హీరోయిన్లు ఒకరిపై ఒకరు అసూయ పడటం, తిట్టుకోవడం సహజమే. ఈ విషయంలో మరో అడుగు ముందుకేసిన ఇద్దరు హీరోయిన్లు ఏకంగా పోలీసు స్టేషన్ గడప తొక్కారు. ఒకరిపై మరొకరు కేసు పెట్టుకున్నారు. ఈ ఇద్దరూ బాలీవుడ్ లో బోల్డ్ హీరోయిన్స్ గా పేరు తెచ్చుకున్న రాఖీ సావంత్, షెర్లిన్ చోప్రా. ఇద్దరూ పరస్పరం లైంగిక వేధింపులు, పరువు నష్టం ఫిర్యాదులు చేయడం గమనార్హం. ప్రస్తుతం టీవీ షో బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా ఉన్న నటుడు, నిర్మాత సాజిద్ ఖాన్‌పై షెర్లిన్ చోప్రా లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన తర్వాత ఆమెకు, రాఖీ సావంత్ కు మధ్య మాటల యుద్ధం మొదలైంది. 

 సాజిద్ ఖాన్‌కు రాఖీ సావంత్ బహిరంగంగా మద్దతు ఇచ్చింది. సాజిద్ పై షెర్లిన్ చేసిన ఆరోపణలకు సంబంధించి ఆమెపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రతిగా షెర్లిన్ కూడా సావంత్‌ ను తిట్టిపోసింది. రాఖీ సావంత్‌, ఆమె లాయర్ ఫల్గుణి బ్రహ్మభట్‌పై షెర్లిన్ చోప్రా అంబోలా పోలీసులకు ఈ నెల 8న  ఫిర్యాదు చేసింది. మీడియా సమావేశంలో ఓ అభ్యంతరకర వీడియోను చూపించి వారిద్దరూ తనను కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో నటి సావంత్, ఆమె లాయరుపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తాజాగా రాఖీ సావంత్ ఒషివార పోలీస్ స్టేషన్ లో షెర్లిన్ పై ఫిర్యాదు చేసింది. వీరి వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో చూడాలి.
Bollywood
HEROINES
Sherlyn Chopra
Rakhi Sawant

More Telugu News