రేపు విశాఖకు పవన్... ప్రధాని మోదీతో జనసేనాని భేటీ
- రేపు విశాఖ రానున్న ప్రధాని నరేంద్ర మోదీ
- మోదీతో భేటీ కోసం రేపు విశాఖ వెళ్లనున్న పవన్ కల్యాణ్
- ఏపీలోని పరిస్థితులను మోదీకి వివరించనున్న జనసేనాని
విశాఖ చేరిన తర్వాత శుక్రవారమే పవన్ కల్యాణ్ ప్రధానితో బేటీ అవుతారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయాలు, రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితులపై ఆయన ప్రధానికి వివరించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పవన్ 2 రోజుల పాటు విశాఖలోనే వుంటారు. అయితే ప్రధాని అధికారిక కార్యక్రమాలకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా హాజరు కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మోదీ పాల్గొనే అధికారిక కార్యక్రమాలకు పవన్ హాజరవుతారా? లేదా? అన్న వివరాలు తెలియరాలేదు.