Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్.. శరత్ చంద్రారెడ్డిని కోర్టులో హాజరుపరిచిన ఈడీ

EC produces Sharath Chandra Reddy in court in Delhi liquor scam
  • లిక్కర్ స్కామ్ లో శరత్ తో పాటు, వినయ్ బాబును అరెస్ట్ చేసిన ఈడీ
  • ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టిన అధికారులు
  • 14 రోజుల రిమాండ్ కు ఇవ్వాలని కోర్టును కోరిన వైనం
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డితో పాటు మద్యం వ్యాపారి వినయ్ బాబును ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మూడు రోజుల విచారణ తర్వాత వీరిని ఈడీ అధికారులు ఈరోజు అరెస్ట్ చేశారు. అనంతరం వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులోని ప్రత్యేక న్యాయస్థానంలో ఈడీ అధికారులు ప్రవేశపెట్టారు. వీరిద్దరినీ 14 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును అధికారులు కోరారు. ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి.
Delhi Liquor Scam
Sharath Chandra Reddy
Enforcement Directorate

More Telugu News