Bellamkonda Ganesh: 'నేను స్టూడెంట్ సర్' టీజర్ రిలీజ్ డేట్ చెప్పిన హీరో!

  • బెల్లంకొండ గణేశ్ రెండో సినిమాగా 'నేను స్టూడెంట్ సర్'
  • ఈ నెల 12వ తేదీన రిలీజ్ కానున్న ఫస్టు టీజర్ 
  • కథానాయికగా భాగ్యశ్రీ కూతురు పరిచయం 
  • డిసెంబర్ లో సినిమాను రిలీజ్ చేసే ఆలోచన  
Nenu Student Sir Movie Update

బెల్లంకొండ గణేశ్ హీరోగా తెరకెక్కిన 'స్వాతిముత్యం' సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది ఆయన ఫస్టు సినిమానే అయినప్పటికీ, ఆ కొత్తదనం ఎక్కడా కనిపించలేదు. లుక్ పరంగా .. నటన పరంగా కూడా ఆకట్టుకున్నాడు. కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటే కుర్రాడు నిలబడతాడు అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ తరువాత పెద్ద గ్యాప్ లేకుండానే ఆయన నుంచి మరో సినిమా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
ఆయన రెండో సినిమాగా 'నేను స్టూడెంట్ సర్' అనే సినిమా రూపొందుతోంది. ఇంతకుముందు 'నాంది' వంటి హిట్ సినిమాను నిర్మించిన సతీశ్ వర్మ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో రాఖి ఉప్పలపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు. ఈ నెల 12వ తేదీన టీజర్ ను వదలనున్నట్టు హీరోతో చెప్పించారు. 

ఇందులో బెల్లంకొండ గణేశ్ జోడీగా అవంతిక పరిచయం కానుంది. తెలుగులో ఆమెకి ఇదే తొలి సినిమా. ఆ బ్యూటీ ఎవరో కాదు 'మైనే ప్యార్ కియా' హీరోయిన్ భాగ్యశ్రీ కూతురే. మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. డిసెంబర్ లో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు

More Telugu News