Airtel: ఎయిర్ టెల్ నుంచి రూ.199కే నెలవారీ ప్లాన్

  • 30 రోజుల వ్యాలిడిటీ
  • నెల మొత్తం మీద  3జీబీ ఉచిత డేటా
  • ఉచిత ఎస్ఎంఎస్ లు 300
  • కాల్స్ పూర్తిగా ఉచితం
Airtel Rs 199 plan launched with full 30 days validity unlimited calls and more benefits

భారతీ ఎయిర్ టెల్ నెల రోజులకు రూ.199 రీచార్జ్ తో కూడిన ప్రీపెయిడ్ ప్లాన్ ను ప్రకటించింది. దీని వ్యాలిడిటీ 30 రోజులు. కాల్స్ విషయంలో పరిమితి లేకుండా మాట్లాడుకోవచ్చు. కానీ, నెల మొత్తం మీద డేటా కేవలం 3జీబీ మాత్రమే ఉచితం. అంటే డేటాను పెద్దగా ఉపయోగించుకోని వారి కోసం ఈ ప్లాన్ ను తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. అలాగే, 30 రోజులకు 300 ఎస్ఎంఎస్ లు ఉచితం. 


నెలలో 3జీబీ డేటా దాటిన తర్వాత ప్రతి ఒక ఎంబీ డేటాకు 50 పైసల చొప్పున చార్జీ ఉంటుంది. అలాగే, 300 ఉచిత ఎస్ఎంఎస్ లు అయిపోయిన తర్వాత ప్రతీ లోకల్ ఎస్ఎంఎస్ కు రూ.1, ఎస్టీడీ ఎస్ఎంఎస్ కు రూ.1.5 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. నెల మొత్తం మీద 300 ఉచిత ఎస్ఎంఎస్ లు ఉన్నప్పటికీ, యూజర్ ఒక రోజులో 100 ఉచిత ఎస్ఎంఎస్ లను ఉపయోగించుకోగలరు. అంతకుమించి ఒకే రోజులో ఎస్ఎంఎస్ లు పంపుకోవాలంటే చార్జీ పడుతుంది. సెకండరీ సిమ్ వాడుకునే వారు, డేటా తక్కువగా ఉపయోగించుకునే వారికి ఈ ప్లాన్ అనుకూలం. 

రిలయన్స్ జియో సైతం రూ.199 ప్లాన్ ను ఆఫర్ చేస్తోంది. కాకపోతే రోజువారీగా 1.5జీబీ ఉచిత డేటా, రోజువారీ 100 ఉచిత ఎస్ఎంఎస్ లను అందిస్తోంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 23 రోజులు.

More Telugu News