Ram: అటు మాస్ డైరెక్టర్ మూవీలో .. ఇటు మాస్ స్టార్స్ తో 'ఊర్వశి రౌతేలా సందడి!

Urvashi Rautela upcoming telugu movies
  • బాలీవుడ్ బ్యూటీగా ఊర్వశి రౌతేలాకి క్రేజ్ 
  • సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ 
  • ఐటమ్ భామగానే ఎక్కువ మార్కులు 
  • త్వరలో టాలీవుడ్ తెరపైనా అందాల సందడి   
ఊర్వశి రౌతేలా .. ఈ పేరు వింటే చాలు కుర్రకారు ఉత్సాహంతో ఊగిపోతుంది. వెండితెరపై ఆమె పాదరసంలా జారిపోతూ కనిపిస్తుంది. మెరుపులన్నీ కలిపి అల్లేసినట్టుగా అనిపిస్తుంది. 2013లోనే ఈ బ్యూటీ బాలీవుడ్ తెరకి పరిచయమైంది. బాలీవుడ్ ను ఈ సుందరి షేక్ చేయడం ఖాయమని అంతా అనుకున్నారు .. కానీ అలా జరగలేదు. ఈ భామను హీరోయిన్ గా కంటే కూడా ఐటమ్ సాంగ్స్ లో చూడటానికే కుర్రాళ్లు ఇష్టపడ్డారు. 

దాంతో సహజంగానే ఊర్వశి ఆ దిశగా అడుగులు వేస్తూ వెళ్లింది. తనకి సినిమాల ద్వారా కంటే, సోషల్ మీడియా ద్వారా వచ్చిన క్రేజ్ ఎక్కువ. ఒక సినిమా చేస్తే వచ్చే పారితోషికాన్ని ఒక ఐటమ్ సాంగ్ ద్వారానే సంపాదిస్తూ ఆమె బిజీ అయింది. ఊర్వశిని తెలుగు తెరపైకి తీసుకురావడానికి ఇంతకుముందు చాలామంది ట్రై చేశారుగానీ కుదరలేదు. 

ఇంకా ఆలస్యం చేస్తే బాగుండదని అనుకుందేమో, ఒకేసారి రెండు తెలుగు సినిమాలలో ఐటమ్ భామగా సందడి చేయడానికి అంగీకరించింది. బోయపాటి సినిమాలో రామ్ హీరోగా చేస్తున్న సినిమాలో ఐటమ్ సాంగులో చెలరేగనుంది. అలాగే చిరంజీవి కథానాయకుడిగా రూపొందుతున్న 'వాల్తేరు వీరయ్య'లోను దుమ్ము రేపేయనుంది. ఆల్రెడీ ఈ రెండు సినిమాలకి సంబంధించిన ఐటమ్ సాంగ్స్ ను చిత్రీకరించినట్టు సమాచారం. వచ్చే ఏడాదిలో ఈ సినిమాలు విడుదల కానున్నాయి.
Ram
Urvashi Rautela
Chiranjeevi

More Telugu News