Bollywood: సల్మాన్​ ఖాన్​ తో బాక్సర్​ నిఖత్​ జరీన్ సూపర్ డ్యాన్స్.. వీడియో వైరల్​

Salman Khan recreates Saathiya Yeh Tune Kya Kiya with boxer Nikhat Zareen
  • సల్మాన్ కు వీరాభిమాని అయిన నిఖత్ జరీన్
  • ముంబైలో ఆయనను కలిసిన యువ బాక్సర్
  • తన కల నిజమైందని ట్వీట్
భారత స్టార్‌ బాక్సర్‌, హైదరాబాదీ నిఖత్‌ జరీన్‌ తాను ఎంతగానే అభిమానించే బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ను ఎట్టకేలకు కలుసుకుంది. ఈ సందర్భంగా ఖాన్‌తో సెల్ఫీ దిగడమే కాదు ఆయనతో నృత్యం కూడా చేసింది. ముంబైలో సల్మాన్‌ కొత్త చిత్రం 'కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్' సెట్‌కు వెళ్లిన నిఖత్‌ తన ఆరాధ్య నటుడిని ప్రత్యక్షంగా కలిసింది. ఈ సందర్భంగా 1991లో వచ్చిన లవ్‌ సినిమాలో ‘సాథియా యే తూనే క్యా కియా’ అనే పాటను ఈ ఇద్దరూ రీక్రియేట్ చేశారు. ఈ పాటకు సల్మాన్ తో పాటు నిఖత్ చాలా అందంగా డ్యాన్స్‌ చేసి ఆకట్టుకుంది. ఈ వీడియోను తన ట్విట్టర్‌ అకౌంట్‌లో నిఖత్ షేర్ చేసింది. 

‘ఎట్టకేలకు నా నిరీక్షణ ముగిసింది. నా కల నిజమైంది’ అని క్యాప్షన్స్ ఇచ్చింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిఖత్‌ జరీన్ కు చిన్నప్పటి నుంచి సల్మాన్‌ అంటే చాలా ఇష్టం. ఆమె ప్రపంచ ఛాంపియన్‌షిప్ లో స్వర్ణ పతకం నెగ్గినప్పుడు అభినందిస్తూ సల్మాన్ ట్వీట్ చేశారు. ఈ విషయం తెలిసి యువ బాక్సర్ ఉబ్బితబ్బిబ్బయిపోయింది. తన గురించి సల్మాన్‌ ట్వీట్‌ చేశాడంటే నమ్మలేపోతున్నానని చెప్పింది. ఒక్కసారైనా సల్మాన్‌ను కలుసుకోవాలని ఉందని తెలిపింది. తాజాగా ఆమెకు ఆ అవకాశం లభించింది. వరల్డ్ ఛాంపియన్ షిప్, కామన్వెల్త్ గేమ్స్ లో నెగ్గిన స్వర్ణ పతకాలను సల్మాన్ కు చూపించింది. ఆయనతో సెల్ఫీ తీసుకొని కాసేపు నృత్యం చేసింది.
Bollywood
Salman Khan
nikhat zareen
boxer
dance
Viral Videos

More Telugu News