jobs: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో ఉద్యోగాలు.. వివరాలివిగో!

  • ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ గ్రాడ్యుయేట్లకు అవకాశం
  • ఈ నెలాఖరులోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి
  • రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక
  • ప్రారంభంలోనే నెలకు రూ. 50 వేల దాకా అందుకునే అవకాశం
job recrutment in Indian Overseas Bank

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు వివిధ శాఖలలోని ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పెషలిస్ట్ ఆఫీసర్లు, ఐటీ ప్రొఫెషనల్ పోస్టుల నియామకం కోసం అర్హతగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇంజనీరింగ్, మేనేజ్ మెంట్ విభాగాల్లో డిగ్రీ, పీజీ చేసిన 25 నుంచి 30 ఏళ్ల యువతీయువకులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని తెలిపింది.

ఖాళీలు..
25 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ – ఐటీ ప్రొఫెషనల్ (ఎంఎంజీ స్కేల్-2) పోస్టులు

ఏయే విభాగాల్లో..
డేటా ఇంజనీర్, క్లౌడ్ ఇంజనీర్, మిడిల్‌వేర్ ఇంజనీర్, నెట్‌వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్, ఒరాకిల్ డీబీఏ, సర్వర్ అడ్మినిస్ట్రేటర్, బిజినెస్ అనలిస్ట్, డేటా సైంటిస్ట్, రూటింగ్ అండ్‌ స్విచింగ్ ఇంజనీర్, హార్డ్‌వేర్ ఇంజనీర్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్, డిజిటల్ బ్యాంకింగ్, ఏటీఎం మేనేజ్డ్ సర్వీసెస్ అండ్‌ ఏటీఎం స్విచ్, మర్చంట్ అక్విజిషన్‌ తదితర విభాగాలు..

అర్హతలు..
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌/ఎంఎస్సీ/ఎంబీఏ/ఎంసీఏ/పీజీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత.

వయసు..
వయసు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు చేసే విధానం..
2022 నవంబర్ 30 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి..

దరఖాస్తు ఫీజు..
జనరల్ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.100 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. 

ఎంపిక..
ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ

వేతనం..
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.48,170 నుంచి రూ.69,810 వేతనంగా అందుకుంటారు.

More Telugu News