Karthi: కార్తి 25వ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన అనూ ఇమ్మాన్యుయేల్!

Anu Emmanuel in karthi movie
  • శిరీష్ మూవీతో తాజాగా లభించిన హిట్టు 
  • కార్తి తాజా చిత్రంగా సెట్స్ పైకి వెళ్లిన 'జపాన్'
  • దర్శకుడిగా రాజు మురుగన్
అనూ ఇమ్మాన్యుయేల్ తెలుగు తెరకి పరిచయమై చాలా కాలమే అయింది. ఆమె కళ్లు .. నవ్వు ప్రత్యేకమైన ఆకర్షణ అని చెప్పాలి. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తరువాత చాలా వేగంగా పవన్ కల్యాణ్ .. బన్నీ సరసన నటించే స్థాయి వరకూ వెళ్లింది. దురదృష్టం కొద్దీ ఆ స్టార్ హీరోలతో చేసిన సినిమాలు రెండూ ఫ్లాప్ అయ్యాయి. దాంతో సహజంగానే ఆమె మిగతా హీరోయిన్స్ కంటే వెనుకబడిపోయింది.

అలాంటి అనూ ఇమ్మాన్యుయేల్ కి 'ఊర్వశివో రాక్షసివో' సినిమా కలిసొచ్చింది. ఈ సినిమా హిట్ ఆమెకి ఊరటనిచ్చింది. దాంతో టాలీవుడ్ మేకర్స్ కొందరు ఆమె డేట్స్ కోసం సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె కార్తి సినిమా చేయడానికి అంగీకరించడం విశేషం. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, 'జపాన్' అనే టైటిల్ ను ఖరారు చేశారు.

ఈ రోజునే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. కెరియర్ పరంగా కార్తికి ఇది 25వ సినిమా. 'సర్దార్' హిట్ తరువాత కార్తి చేస్తున్న సినిమా కావడంతో సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో సునీల్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుండటం విశేషం.
Karthi
Anu Ammanuel
Sunil
Japan movie

More Telugu News