Donald Trump: త్వరలో కీలక ప్రకటన చేయనున్న ట్రంప్

Trump says he will announce a key issue
  • 2020 ఎన్నికల్లో ఓటమిపాలైన ట్రంప్
  • ఒహాయోలో ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర వ్యాఖ్యలు
  • నవంబరు 15న అతిపెద్ద ప్రకటన చేస్తానని వెల్లడి
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని రోజుల్లో కీలక ప్రకటన చేయనున్నారు. 'ఈ నెల 15న ఫ్లోరిడాలో అతిపెద్ద ప్రకటన చేయబోతున్నా..' అని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ఒహాయోలో ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చిన ఆయన ఈ మేరకు వెల్లడించారు. ట్రంప్ మరో పర్యాయం అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తాడంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

ట్రంప్ గత అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఓ పర్యాయం అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించిన ట్రంప్... దూకుడుగా వెళుతూ ప్రపంచ రాజకీయాలపై తనదైన ముద్రవేశారు. ఓటమిపాలైన తర్వాత ట్రంప్ అప్పుడప్పుడు రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ ఉనికి చాటుకుంటున్నారు. ఇప్పుడు ఫ్లోరిడాలో చేయబోయే ప్రకటన వచ్చే అధ్యక్ష ఎన్నికలకు సంబంధించినదే అయ్యుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Donald Trump
Presidential Elections
USA

More Telugu News