Congress: భారత్ జోడో యాత్రలో విషాదం... సేవా దళ్ ప్రధాన కార్యదర్శి కృష్ణ కుమార్ పాండే మృతి

congress party Seva Dal general secretary Krishna Kumar Pandey passes away in bharat jodo yatra
  • సోమవారం తెలంగాణ నుంచి మహారాష్ట్రలోకి అడుగుపెట్టిన భారత్ జోడో యాత్ర
  • యాత్రలో రాహుల్ కు ముందు జాతీయ జెండా చేతబట్టి నడుస్తున్న సేవా దళ్ బృందం
  • ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్న కృష్ణ కుమార్ పాండే
  • మంగళవారం యాత్రలో నడుస్తూనే ఒరిగిపోయిన వైనం
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సోమవారం తెలంగాణను దాటేసి మహారాష్ట్రలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నేటి ఉదయం మహారాష్ట్రలో జోడో యాత్ర తొలి రోజు ప్రారంభమైంది. ఈ సందర్భంగా యాత్రలో విషాదం చోటుచేసుకుంది. రాహుల్ గాంధీకి ముందు జాతీయ జెండాను పట్టుకుని కాంగ్రెస్ పార్టీ సేవా దళ్ కార్యకర్తల బృందం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్న సేవాదళ్ ప్రధాన కార్యదర్శి కృష్ణ కుమార్ పాండే యాత్రలో మరణించారు. 

రోజు మాదిరే మంగళవారం కూడా కృష్ణ కుమార్ పాండే రాహుల్ కు ముందు నడుస్తున్న సేవా దళ్ బృందానికి నేతృత్వం వహిస్తూ జాతీయ జెండాను పట్టుకుని నడిచారని, రోజు మాదిరిగానే జాతీయ జెండాను తన సహచరుడి చేతిలో పెట్టిన కాసేపటికే కృష్ణ కుమార్ పాండే కింద పడిపోయారు. ఆ వెంటనే ఆయన మృతి చెందారు. ఈ ఘటనతో రాహుల్ తో పాటు పార్టీ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యాయి. కృష్ణ కుమార్ పాండేకు రాహుల్ సహా పార్టీ శ్రేణులు కన్నీటి నివాళి అర్పించాయి.
Congress
Rahul Gandhi
Bharat Jodo Yatra
Maharashtra
Seva Dal
Krishna Kumar Pandey

More Telugu News