reliance Jio: ఈ మొబైల్ రీచార్జ్ ప్లాన్లతో అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం ఉచితం

Jio Airtel Vodafone plans offering free Amazon Prime membership
  • నెలవారీ ప్లాన్లపై ఆఫర్ చేస్తున్న టెలికం కంపెనీలు
  • డిస్నీ హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్, సోనీలివ్ కూడా ఉచితమే
  • విడిగా తీసుకోవడం కంటే రీచార్జ్ ప్లాన్లపైనే రేట్లు తక్కువ
అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం ఉంటే, తాజా సినిమాలను సైతం వీక్షించొచ్చు. ఎన్నో షోలను చూడొచ్చు. సంగీతం ఉచితంగా వినొచ్చు. అంతేకాదు, అమెజాన్ నుంచి ఉత్పత్తులను వేగంగా ఎటువంటి షిప్పింగ్ చార్జీ లేకుండా తెప్పించుకోవచ్చు. ప్రైమ్ సభ్యత్వం కోసం ఒక నెలకు రూ.179, మూడు నెలలకు రూ.459, ఏడాదికి అయితే రూ.1,499 చొప్పున అమెజాన్ వసూలు చేస్తోంది. అందుకని ఉచితంగా అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ కోరుకునే వారు ఎయిర్ టెల్, జియో వొడాఫోన్ అందిస్తున్న ప్లాన్లను రీచార్జ్ చేసుకుంటే సరిపోతుంది. 

రిలయన్స్ జియో
జియో రూ.399, రూ.599, రూ.799, రూ.999, రూ.1,499 ప్లాన్లపై అమెజాన్ ప్రైమ్ ను ఆఫర్ చేస్తోంది. ఇవన్నీ నెలవారీ ప్లాన్లు. ఇంకా నెట్ ఫ్లిక్స్, డిస్నీ హాట్ స్టార్ ను కూడా ఉచితంగా ఇస్తోంది.

ఎయిర్ టెల్
భారతీ ఎయిర్ టెల్ సైతం రూ.499, రూ.999, రూ.1,199, రూ.1,499 ప్లాన్లపై అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్ స్టార్ ను అందిస్తోంది. వీటిల్లో రూ.1,199, రూ.1,499 ప్లాన్లపై నెట్ ఫ్లిక్స్ ను కూడా ఉచితంగా వీక్షించొచ్చు.

వొడాఫోన్
వొడాఫోన్ కస్టమర్లు రూ.501, రూ.701, రూ.1,101 ప్లాన్లపై అమెజాన్ ప్రైమ్ సేవలను ఉచితంగా అందుకోవచ్చు. అలాగే, డిస్నీ హాట్ స్టార్, సోనీలివ్ ఓటీటీ కంటెంట్ ను కూడా ఉచితంగా చూడొచ్చు.
reliance Jio
Airtel
Vodafone
Amazon Prime
free membership

More Telugu News