Pawan Kalyan: ఇప్పటం గ్రామానికి పవన్ ఆలివ్ గ్రీన్ టీషర్టు ధరించి రావడం వెనుక కారణం చెప్పిన జనసేన

Janasena reveals why Pawan Kalyan wore olive green tshirt while his tour in Ippatam
  • ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ
  • కూల్చివేతలకు పాల్పడిన అధికారులు
  • ఇప్పటం గ్రామంలో పర్యటించిన పవన్
  • బాధితులకు పరామర్శ
  • టీషర్టు, జీన్స్ ధరించి వచ్చిన జనసేనాని
ఇటీవల గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణలో భాగంగా అధికారులు పలు కూల్చివేతలకు పాల్పడడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, బాధితులను పరామర్శించేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించారు. ఆయన ఆర్మీ స్టైల్ ఆలివ్ గ్రీన్ హుడీ టీషర్టు, బ్లూ జీన్స్, షూ ధరించి ఇప్పటం గ్రామానికి వచ్చారు. 

అయితే, పవన్ ఆలివ్ గ్రీన్ టీషర్టునే ధరించి రావడానికి ప్రత్యేక కారణం ఉందని జనసేన పార్టీ వెల్లడించింది. గూండాగిరీ ప్రభుత్వంపై పోరాటానికి సూచికగానే పవన్ మిలిటరీ ఆలివ్ గ్రీన్ టీషర్టు ధరించారని తెలిపింది. 

ఈ పోరాటంలో పవన్ ఓ సైనికుడిగా యుద్ధం చేసేందుకు సిద్ధమయ్యారని వివరించింది. ఇది సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్న రౌడీ రాజకీయాలపై పోరాటం అని, ప్రజలను దోచుకుతింటూ, వారిని రోడ్డున పడేస్తున్న అవినీతి నాయకులపై పోరాటం అని జనసేన ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
Pawan Kalyan
Olive Green T Shirt
Ippatam
Janasena

More Telugu News