టాంజానియాలో ఘోర ప్రమాదం... విక్టోరియా సరస్సులో కూలిపోయిన ప్రయాణికుల విమానం

Passenger plane collapsed into Lake Victoria
  • ల్యాండయ్యే ప్రయత్నంలో సరస్సులో కూలిన విమానం
  • విమానంలో 43 మంది ప్రయాణికులు
  • 26 మందిని కాపాడిన సహాయక సిబ్బంది
ఆఫ్రికా దేశం టాంజానియాలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రయాణికుల విమానం విక్టోరియో సరస్సులో కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 43 మంది ప్రయాణికులు ఉన్నారు. 

టాంజానియాలోని అతిపెద్ద నగరం దార్ ఎస్ సలామ్ నుంచి ఈ విమానం బుకోబా పట్టణం వస్తోంది. బుకోబా ఎయిర్ పోర్టులో ల్యాండయ్యే ప్రయత్నంలో, ఎయిర్ పోర్టును ఆనుకుని ఉన్న సరస్సులో కూలిపోయింది. 

వెంటనే స్పందించిన సహాయక సిబ్బంది 26 మందిని కాపాడారు. వారిని ఆసుపత్రికి తరలించారు. అధికారులు స్థానిక మత్స్యకారుల సాయంతో విమాన ప్రయాణికుల కోసం గాలిస్తున్నారు. తోక భాగం మినహా విమానం మొత్తం సరస్సులో మునిగిపోయింది.
Go Back to Shorts
Plane
Crash
Lake Victoria
Bukoba
Dar Es Salaam
Tanzania

More Telugu News