NTR30: ఎన్టీఆర్ 30వ చిత్రం ప్రీప్రొడక్షన్ పనులు ముమ్మరం

  • కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చిత్రం
  • త్వరలో పూజా కార్యక్రమాలు
  • చర్చల్లో పాల్గొన్న కొరటాల శివ, సాబు సిరిల్, రత్నవేలు
NTR 30th film pre production on full swing

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న 30వ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ఊపందుకున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ కొత్త చిత్రం త్వరలోనే పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో, ప్రారంభ షెడ్యూల్ కు సంబంధించిన చర్చల్లో దర్శకుడు కొరటాల శివ, కెమెరామన్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ పాల్గొన్నారు. 

దీనిపై యువసుధ ఆర్ట్స్ తన సోషల్ మీడియా అకౌంట్లో వెల్లడించింది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. కాగా, ఈ చిత్రం ఆగిపోయిందంటూ ఇటీవల ప్రచారం జరిగింది. అయితే, చిత్రబృందం తాజా పోస్టుతో రూమర్లకు అడ్డుకట్ట వేసింది.

More Telugu News