parrot: చోరీలపై మాట్లాడుతున్న జర్నలిస్టు ఇయర్ ఫోన్ ఎత్తుకెళ్లిన చిలుక

Parrot Steals Chilean Reporter Earphone During Broadcast About Theft
  • చిలీలో లైవ్ లో మాట్లాడుతుంటే ఇయర్ ఫోన్ ఎత్తుకెళ్లిన చిలుక
  • దొంగతనాలపై కథనం ప్రసారంచేస్తూ తను కూడా బాధితుడయ్యాడు
  • తర్వాత ఇయర్ బడ్ దొరికిందని వెల్లడించిన జర్నలిస్టు
దొంగతనాలపై ఓ ఫీల్డ్ జర్నలిస్టు ప్రత్యక్ష ప్రసారంలో మాట్లాడుతున్నాడు.. ఇంతలో ఓ చిలుక ఎగురుకుంటూ వచ్చి ఆయన చెవిలో ఉన్న ఇయర్ బడ్ ను ఎత్తుకెళ్లింది. ఇదంతా కెమెరాలో రికార్డు కావడం, ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ గా మారింది. బాధితుల కష్టాలు చెబుతూ పాపం తను కూడా బాధితుడయ్యాడంటూ ఆ రిపోర్టర్ కు సానుభూతిగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చిలీలో జరిగిన ఈ వింత దొంగతనం వివరాలు..

దేశంలో పెరిగిపోతున్న దొంగతనాలపై చిలీ రిపోర్టర్ నికోలస్ క్రుమ్ ఓ కథనం చేస్తున్నారు. వరుస దొంగతనాలపై వివరాలు చెబుతుంటే టీవీలో ప్రత్యక్ష ప్రసారం జరుగుతోంది. ఇంతలో ఓ రామచిలుక ఎగురుకుంటూ వచ్చి నికోలస్ భుజంపై వాలింది. నికోలస్ పట్టించుకోకపోవడంతో చూసి చూసి ఆయన చెవిలో ఉన్న ఇయర్ బడ్ ను నోట కరుచుకుని ఎగిరిపోయింది. కాస్త ఆలస్యంగా ప్రతిస్పందించిన నికోలస్.. చిలుకను పట్టుకుందామని ప్రయత్నించినా దొరకలేదు. తర్వాత అక్కడికి దగ్గర్లోనే ఇయర్ బడ్ దొరికిందని నికోలస్ చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
parrot
chile
live telecost
ear bud
theft

More Telugu News