Palvayi Sravanthi: మునుగోడు బైపోల్స్.. కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయిన పాల్వాయి స్రవంతి

Palvayi Sravanthi went out of counting center
  • మునుగోడులో ఉత్కంఠను రేపుతున్న ఫలితాలు
  • రౌండ్ రౌండ్ కు మారుతున్న ఆధిక్యత
  • పోటీలో పూర్తిగా వెనుకబడిన కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి
మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. రౌండ్ రౌండ్ కు ఫలితాలు మారుతున్నాయి. తొలి రౌండ్ లో టీఆర్ఎస్... రెండు, మూడు రౌండ్లలో బీజేపీ... నాలుగో రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యతను సాధించాయి. 

మరోవైపు పోటీలో మరో ప్రధాన పార్టీ కాంగ్రెస్ వెనుకబడిపోయింది. కాంగ్రెస్ గెలుపు అసాధ్యమనే విషయం కౌంటింగ్ ప్రారంభంలోనే అర్థమయిపోయింది. దీంతో, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కౌంటింగ్ సెంటర్ నుంచి నిరాశతో నిష్క్రమించారు.
Palvayi Sravanthi
Congress
Munugode

More Telugu News