Tollywood: అర్జున్ సినిమా నుంచి బయటకు వచ్చేశా.. కారణమిదేనన్న విష్వక్సేన్

tollywood hero Vishwaksen gives clarity on row with senior actor arjun
  • చిన్న చిన్న మార్పులకు అర్జున్ అంగీకరించడం లేదన్న విష్వక్
  • తాను చెప్పినట్లు నడుచుకోవాలని అర్జున్ పట్టుబడుతున్నారని ఆరోపణ
  • మనసుకు నచ్చని పని చేయలేక సినిమా నుంచి తప్పుకున్నానని వెల్లడి
  • రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేశానన్న టాలీవుడ్ యంగ్ హీరో
దర్శకుడిగా మారిన సీనియర్ నటుడు అర్జున్ తో నెలకొన్న వివాదంపై టాలీవుడ్ యంగ్ హీరో విష్వక్సేన్ తాజాగా వివరణ ఇచ్చారు. స్వీయ దర్శకత్వంలో అర్జున్ నిర్మిస్తున్న సినిమా నుంచి తాను బయటకు వచ్చేశానని ఆయన చెప్పారు. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించి తాను తీసుకున్న రెమ్యూనరేషన్, చెక్కులు, డాక్యుమెంట్లను నిర్మాతల మండలికి ఈ పాటికే పంపించి వేశానని కూడా అతడు తెలిపాడు.

ఈ మేరకు శనివారం రాత్రి విష్వక్ ఓ ప్రకటన విడుదల చేశాడు. తన కుమార్తెను టాలీవుడ్ కు పరిచయం చేస్తూ అర్జున్ నిర్మిస్తున్న చిత్రంలో విష్వక్ హీరోగా ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ 3 నెలల క్రితమే ప్రారంభం కాగా... అర్జున్, విష్వక్ ల మధ్య విభేదాలతో తాజాగా సినిమా ఆగిపోయింది.

అర్జున్ తో తనకు నెలకొన్న వివాదంపైనా విష్వక్ స్పందించాడు. సినిమాలో పాటలు, సంభాషణలు, మ్యూజిక్ గురించి తాను కొన్ని సూచనలు చేసిన మాట వాస్తవమనని అన్నాడు. ఆసక్తికరంగా అనిపించిన చిన్న చిన్న మార్పులకు కూడా అర్జున్ అస్సలు అంగీకరించడం లేదని వాపోయాడు. తాను చెప్పినట్లే నడుచుకోవాలంటూ అర్జున్ ఆంక్షలు పెడుతున్నారని తెలిపాడు. సెట్ లో తన మాటకు గౌరవం ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కారణంగానే తన మనసుకు నచ్చని పని చేయలేక సినిమా నుంచి బయటకు వచ్చేశానని విష్వక్ తెలిపాడు.
Tollywood
Arjun
Vishwaksen

More Telugu News