'కోరమీను' టీజర్ విడుదల చేసిన స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని
- జాలరిపేట కథాంశంతో తెరకెక్కిన చిత్రం
- 'మీసాల రాజు గారికి మీసాలు తీసేశారంట' అంటూ కొన్ని రోజులుగా ప్రచారం
- టీజర్లో మీసాల రాజు ఎవరో వెల్లడించిన టీమ్
'డబ్బుకు ఎక్కువ పవర్ అనుకుంటారు గానీ అసలైన పవర్ భయానిదేరా' అని హరీష్ ఉత్తమన్ చెప్పే డైలాగ్, 'ఇది జాలరిపేట. డబ్బున్నోడు, డబ్బు లేనోడు... అంతే!' అని హీరోయిన్ కిషోరీతో ఆనంద్ రవి చెప్పే మాట... వాళ్ల క్యారెక్టరైజేషన్ల గురించి వివరించేలా ఉన్నాయి.
ఈ చిత్రంలో రవి, ఉత్తమన్, శత్రు, కిషోరీ దత్రక్, రాజా రవీంద్ర, గిరిధర్, ముత్యంగా 'జబర్దస్త్' ఇమ్మాన్యుయెల్, ఇందు కుసుమ, ప్రసన్న కుమార్, ఆర్కే నాయుడు నటించారు.