Gujarat: హిమాచల్‌ ప్రదేశ్, గుజరాత్ లలో అధికారం మళ్లీ బీజేపీదే!: ఎగ్జిట్ పోల్స్

  • గుజరాత్ లో కూడా కమల వికాసమే
  • 125కు పైగా సీట్లను గెలుచుకుంటుంది
  • హిమాచల్ లో 41 సీట్లలో బీజేపీ అభ్యర్థులే గెలుస్తారు
  • ఒపీనియన్‌ పోల్స్‌లో వెల్లడి
bjp will win in Himachal pradesh and gujarat assembly elections

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగరవేస్తుందని ఒపీనియన్ పోల్స్ లో వెల్లడైంది. వచ్చే నెలలో జరగబోయే గుజరాత్ లోనూ బీజేపీ హవా కొనసాగుతుందని తేల్చాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ మెజారిటీ సీట్లను గెలుచుకుని బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని వెల్లడించాయి. హిమాచల్ ప్రదేశ్ లో ప్రతీ ఎన్నికల్లో ఓటర్లు అధికారపార్టీని మార్చేస్తారు. గత ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీని తర్వాతి ఎన్నికల్లో ప్రతిపక్షంలో కూర్చోబెడతారు. ఈ ఆనవాయితీపై కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకోగా.. ప్రధాని మోదీ చరిష్మాను బీజేపీ నమ్ముకుంది.

హిమాచల్ ప్రదేశ్ లోని 68 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 12న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే! ఈ ఎన్నికల్లో 46 శాతం ఓటర్లు బీజేపీ వైపే మొగ్గుతారని, 41 సీట్లలో ఆ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తారని ‘ఇండియా టీవీ-మాట్రిక్స్’నిర్వహించిన ఒపీనియన్ పోల్ లో వెల్లడైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 25 సీట్లతో సరిపెట్టుకుంటుందని, ఆ పార్టీ 42 శాతం ఓట్లు సాధిస్తుందని తేలింది. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్రంలో బోణీ కొట్టలేదని, ఆ పార్టీకి కేవలం 2 శాతం ఓట్లు మాత్రమే పడతాయని వెల్లడైంది. మిగతా రెండు సీట్లను స్వతంత్ర అభ్యర్థులు గెలుచుకుంటారని ఈ పోల్ తేల్చింది.

గుజరాత్‌ లో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని టైమ్స్ నౌ- ఈటీజీ నిర్వహించిన సర్వే తేల్చింది. రాష్ట్రంలో 45 శాతం ఓట్లతో బీజేపీ 125 నుంచి 135 మధ్యలో అసెంబ్లీ సీట్లను గెలుచుకుంటుందని వెల్లడించింది. కాంగ్రెస్‌ 21 శాతం ఓట్లతో 29-33 సీట్లను, ఆమ్ ఆద్మీ పార్టీ 29 శాతం ఓట్లతో 20-24 సీట్లు గెలుచుకుంటాయని తేల్చింది. ఏబీపీ-సీవోటర్‌ సర్వేలో కూడా గుజరాత్ పీఠం బీజేపీదేనని తేలింది.

More Telugu News