TDP: చంద్రబాబు కనుసైగ చేస్తే మా కార్యకర్తల చేతిలో వైసీపీ గూండాల పరిస్థితి ఏంటి?: అచ్చెన్నాయుడు

ap tdp chief atchannaidu fires ober attack on chandrababu road sho in nandigama
  • నందిగామలో చంద్రబాబు రోడ్ షోపై రాయితో దాడి
  • చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కు గాయాలు
  • దాడిపై ఘాటుగా స్పందించిన అచ్చెన్నాయుడు
  • దాడి చేసిన వారిని, చేయించిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేపట్టిన రోడ్ షోపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం, ఆ దాడిలో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుకు గాయాలు కావడంపై టీడీపీ ఏపీ అద్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఘాటుగా స్పందించారు.   చంద్రబాబు కనుసైగ చేస్తే మా కార్యకర్తల చేతిలో వైసీపీ గూండాల పరిస్థితి ఏంటి? ఆని ఆయన అధికార వైసీపీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు.

చంద్రబాబు రోడ్ షోపై జరిగిన దాడిని ఖండిస్తూ సోషల్ మీడియా వేదికగా అచ్చెన్న శుక్రవారం రాత్రి ఓ పోస్ట్ పెట్టారు. ''చంద్రబాబు గారిపై రాళ్ల దాడి వైసీపీ రౌడీ రాజకీయానికి పరాకాష్ఠ. దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? రౌడీ రాజకీయాలతో భయపెట్టాలనుకోవడం మీ కల. చంద్రబాబు కనుసైగ చేస్తే మా కార్యకర్తల చేతిలో వైసీపీ గూండాల పరిస్థితి ఏంటి? దాడి చేసిన వారిని, దాడి చేయించినవారిని వెంటనే అరెస్ట్ చేయాలి'' అని అచ్చెన్న డిమాండ్ చేశారు.
TDP
Chandrababu
Atchannaidu
Andhra Pradesh
Nadigama
NTR District

More Telugu News