CM Ramesh: పవన్ కల్యాణ్ కు ముప్పు ఉంది.. భద్రత పెంచాలి: సీఎం రమేశ్

CM Ramesh demands to increased security to Pawan Kalyan
  • పవన్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన దుండగులు
  • ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ వ్యాఖ్య
  • కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వ్యాఖ్య
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటి వద్ద అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ఆయన భద్రతపై జనసేన శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు పవన్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించడంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ స్పందించారు. పవన్ కు తగినంత భద్రతను కల్పించాలని అన్నారు. ఆయన ఇంటి వద్ద  కొందరు వ్యక్తులు రెక్కీ నిర్వహించారనే వార్తలు వస్తున్నాయని... అయినప్పటికీ, ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. 

ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించినందుకు ఆయన భద్రతను పట్టించుకోరా? అని ప్రశ్నించారు. వైసీపీ పార్టీ కార్యకర్తల మాదిరి పోలీసులు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కలిసి ఏపీ పోలీసుల తీరుపై ఫిర్యాదు చేస్తామని అన్నారు. పవన్ కు తక్షణమే భద్రతను పెంచాలని డిమాండ్ చేశారు.
CM Ramesh
BJP
Pawan Kalyan
Janasena
YSRCP

More Telugu News