Hyderabad: వేరే మహిళతో అక్రమ సంబంధం.. సీఐ అరెస్ట్!

CI having illegal contact with another women arrested
  • హైదరాబాద్ కమిషనరేట్ సౌత్ జోన్ కంట్రోల్ రూమ్ సీఐగా పని చేస్తున్న రాజు
  • కొంత కాలంగా మరో మహిళతో వివాహేతర సంబంధం
  • ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య
మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న సర్కిల్ ఇన్స్ పెక్టర్ రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ కమిషనరేట్ లో సౌత్ జోన్ కంట్రోల్ రూమ్ ఇన్స్ పెక్టర్ గా రాజు పని చేస్తున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంత కాలంగా ఈయన మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో, మరో మహిళతో ఉన్న సమయంలో ఆయన భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వనస్థలిపురం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. అంతేకాదు, తన భర్తపై కఠన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ ఎదుట ఆమె ఆందోళనకు దిగారు. తన భర్తతో పాటు, అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఇన్స్ పెక్టర్ రాజును పోలీసులు అరెస్ట్ చేశారు.
Hyderabad
CI
Illegal Contact
Arrest

More Telugu News