actor vikram: మణిరత్నంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన విక్రమ్

Vikram thanks Mani Ratnam for two of his most delightful roles
  • రెండు చక్కని పాత్రలను తనకిచ్చినందుకు కృతజ్ఞతలు
  • గతంలోని ఓ వీడియోని షేర్ చేసిన విక్రమ్
  • థ్యాంక్యూ మై గురూ అంటూ ట్వీట్
తమిళ అగ్ర నటుడు విక్రమ్.. దిగ్గజ దర్శకుల్లో ఒకరైన మణిరత్నంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. మణిరత్నం తాజా చిత్రం పొన్నియిన్ సెల్వన్ లో విక్రమ్ అదిత కరికలన్ పాత్రలో నటించారు. తాజాగా ఓ వీడియో క్లిప్ ను విక్రమ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అలాగే, తన కెరీర్ లో రెండు సంతోషకరమైన పాత్రలను తనకు ఇచ్చినందుకు మణిరత్నంకు ధన్యవాదాలు తెలియజేశాడు. 

విక్రమ్ గతంలో మణిరత్నం సినిమా అయిన రావణన్ లోనూ నటించాడు. అందులో నెగెటివ్ రోల్ లో విక్రమ్ కనిపించాడు. ‘‘నా గురించి మీ మంచి మాటలకు, నాకు గుర్తుండిపోయే సంతోషకరమైన రెండు పాత్రలను (వీర, అదిత కరికలన్) నాకు ఆఫర్ చేసి, నటించే అవకాశం కల్పించినందుకు థాంక్యూ మై గురు’’ అంటూ విక్రమ్ ట్వీట్ చేశాడు. ఈ వీడియో మొదటి సినిమా సందర్భంగా ఇద్దరూ మీడియాతో మాట్లాడింది కావడం గమనార్హం. ఇందులో విక్రమ్ ను మణిరత్నం ప్రశంసించడాన్ని చూడొచ్చు.
actor vikram
Mani Ratnam
thanks
tweet

More Telugu News