Telangana: మునుగోడులో టీఆర్ఎస్ దే విజయం.. ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడి

  • ముగిసిన మునుగోడు పోలింగ్
  • ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించిన 2 సంస్థలు
  • తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక పోల్స్ లో టీఆర్ఎస్ కు 40.9 శాతం ఓట్లు
  • త్రిశూల్ సర్వేలో టీఆర్ఎస్ కు 47 శాతం ఓట్లు రావచ్చని అంచనా
Exit polls predicts trs victory in munugode bypolls

తెలంగాణలో సర్వత్రా ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ గురువారం సాయంత్రంతో ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 77.55 శాతం పోలింగ్ నమోదు కాగా... పోలింగ్ గడువు ముగిసే సమయానికి నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ఉన్న నేపథ్యంలో పోలింగ్ శాతం మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. పోలింగ్ గడువు ముగిసిన తర్వాత మునుగోడు ఎన్నికల ఫలితాలపై పలు సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకే విజయం దక్కుతుందని తేల్చేశాయి.


తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక నిర్వహించిన ఎగ్జిట్ పోల్ లో అధికార టీఆర్ఎస్ 40.9 శాతం ఓట్లతో విజయం సాధిస్తుందని తేలింది. అదే సమయంలో బీజేపీకి 31 శాతం ఓట్లు, కాంగ్రెస్ కు 23 శాతం ఓట్లు, బీఎస్పీకి 3.2 శాతం ఓట్లు, ఇతరులకు 1.9 శాతం ఓట్లు వచ్చాయి. ఇక త్రిశూల్ సంస్థ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ లో అధికార టీఆర్ఎస్ కు ఏకంగా 47 శాతం ఓట్లు రాగా... బీజేపీకి 31 శాతం ఓట్లు, కాంగ్రెస్ కు 18 శాతం ఓట్లు, ఇతరులకు 4 శాతం ఓట్లు రానున్నట్లు తేలింది.

More Telugu News